ప్రేమలో ఓడిపోయాను అనో, లేక జీవితంలో ఏమి సాధించలేదు అనో చాల మంది ఆత్మహత్య చేసుకునెంత బలహీనంగా తయారవుతున్నారు నేటి యువత. దీనికి ముఖ్యంగా తల్లి తండ్రుల పర్యవేక్షణ లోపం అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. దీనికి తోడు విద్యా వ్యవస్థ కూడా ఇంకో కారణం.
ఎదుటివారి ముందు గొప్పకోసం మోయలేని భారాన్ని మీద వేసుకుని అప్పులు చేసి మరీ తల్లితండ్రులు పిల్లల్ని చదివించేస్తున్నారు. ఎవడో 26 inch led టి వి కొన్నాడని దానికంటే పెద్దది కొంటాడు ఒకడు. ఇంకొకడు ఎవడో వాళ్ళ పిల్లాడిని రవీంద్రభారతి లో చేర్పించాడని వీడెళ్ళి నారాయణలో చేర్పిస్తాడు. ఇలా ఎక్కడికక్కడ గోప్పలకి పోవడం చివరికి ఎలా అయ్యిందంటే! సామాన్యుడు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే అవమానమేమో అనే అభిప్రాయానికి వచ్చె స్థితికి దిగాజారిపోఎలా తయారుచేస్తున్నారు. చేసేశారు!
కాని ఒక్క విషయం మర్చిపోతున్నారు. పిల్లలకి ఇవ్వాల్సిన జ్ఞాన సంపద, వంశ పారంపర్యంగా వచ్చె సంప్రదాయాలు, మన భారతదేశ విలువలు, ఇలాంటి విషయాలు ఏవి తెలియకుండా పెంచేస్తున్నారు. మా సంపాదన అంతా పిల్లలకే అని చెప్పుకునే మీరు సంపద మాత్రమే ఇస్తే ఎలా ఉపయోగించుకుంటారు? తాగడానికి, తిరగాడానికా? సోమరిపోతులని చేయడానికా? ఎందుకు సంపాదిస్తున్నారు? జ్ఞాన సంపద ఇవ్వలేని మీరు తాత్కాలికమైన సుఖాలని అందించే సంపద ఇచ్చి పిల్లలని ఏమి చేయాలనుకుంటున్నారు?
ఒక క్రిస్టియన్ తన పిల్లలని తీసుకుని క్రమం తప్పకుండా చర్చికి తీసుకెళ్తున్నాడు. ఒక ముస్లిం ప్రతి నిత్యం తన పిల్లలతో ఖురాన్ పారాయణం చేయిస్తున్నాడు. కాని పరమ పవిత్రమైన భారతదేశంలో అందునా హైందవ వంశంలో జన్మించి భగవద్గీత నిత్యం ఒక్క శ్లోకం చెప్పండి మీపిల్లలకి అంటే అదేదో చేయకూడని నేరం చేస్తున్నట్టుభావిస్తున్నారు. ఈ రోజున పురాణాలు, ఇతిహాసాలు, చెప్పే గురువులు లేకపోవచ్చు కాని తల్లితండ్రులు మీరు వున్నారు కదా!
ఇవన్ని ఆలోచిస్తే తరువాతి తరం ఏమైపోతుందో అని బాధ. సంస్కృతం అసలే రాదు. ఇంకా ఎలా? దేనికోసం పెంచుతున్నారు పిల్లలని ఆలోచించండి.. బంగారు బాట అని ముళ్ళకంపలోకి విసిరేస్తున్నారు వాళ్ళ జీవితాలని..!

No comments:
Post a Comment
Please feel free to give feedback , Thank you :)