Sunday, August 11, 2013

కధ

ఒకూర్లో రాజు గారు ఉండెవాడు.. ఆయన రాజ్యంలో జతక పండితుడు ఉండె వాడు..
ఆయన చెప్పింది.. నూటికి నూరు పాళ్ళు జరిగేది..

రాజు గారి జాతకం చూసిన ఆ పండితుడు.. రాజా.. మీరు ఇంకొక వారం రొజుల్లో మరణించ బోతున్నరు.. ఒక సర్పము మీ ప్రాణాలను తీస్తుంది అని చెప్పాడు..

ఆగ్రహించిన రాజు... ఎం మాట్లాడుతున్నవు.. నీ ప్రాణాలు తీస్తా అని అన్నాడు..

రాజా నా అనుభవంలో నేను చెప్పినవన్ని జరిగాయి...ఇది కూడ కచ్చితంగా జరుగుతుంది.. అని అక్కడ నుంచి వెళ్ళి పొయాడు..

ఆలొచించిన రాజు.. జరుగుతుందేమో అని అనుమానం వచ్చింది... ఎందుకు రిస్క్ తీస్కోవదం అని.. మంత్రిని సలహా అడిగాడు..

రాజా మీకు సర్ప గండం ఉంది.. సర్పాలు నేల మీదనే కదా తిరుగుతాయి.. ఆకాశంలో కాదు కదా అన్నడు...

అర్దం కాని రాజు.. సరే అందుకు ఏర్పాట్లు చెయి అని ఆగ్నాపించాడు...

మంత్రి ఒంటి స్థంబం మేద ఒకటి కట్టించాడు.. ఆ మేదలోకి మనుషులు కూడా వెళ్ళడానికి వీలు ఉండదు.. (మెట్లు ఉండవు.. నిచ్చెన ఒక్కటే ఉపయోగించాలి)
రాజు గారు మేదపైన హ్యాపీగా రెస్ట్ తీస్కుంటున్నాడు..
రోజులు గడిచినయి.. ఆహారం సేవకులు నిచ్చెన ద్వారానే అందించే వారు..

రాజు టైం నిజంగానే బాగోలేదు..
పక్కనే పెద్ధ మర్రి చెట్టు ఉంది..
దాని పైకి ఎక్కిన ఒక పాము.. ఎలా దిగాలో తెలియక.. కిందకు దూకింది... నేరుగా రాజు ఉన్న ఒంటి స్థంబం మేడ మీద పడింది... నిద్ర పొతున్న రాజుని కరిచి.. దాని పని అది చూస్కుంది.. 

రాజు నిద్రలోనే ప్రాణాలు వదిలాడు..
జ్యోతిస్కుడు చెప్పింది జరిగింది...

" రాజు నేల మీదనే ఉండి ఉంటే సేవకులు కనీసం బ్రతికించడానికైన ప్రయత్నించే వారు.. అదే మరి కర్మ అంటే..." 
చావుకి బయపడి టైం వేస్ట్ చేస్కోవడం వృదా.. వచ్చే చావు ఎలాగాయిన వస్తది...
రాజు భయపడినప్పుడే చనిపోయాడు.. భయం మనిషిని పిరికివాడిని చేస్తది...ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు...

No comments:

Post a Comment

Please feel free to give feedback , Thank you :)