Wednesday, July 17, 2013

ఉత్తరాయణం

ఆయనం అనగా పయనించడం అని అర్ధం. ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్ధం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సుర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. సుర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒక వైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సుర్యుడు భూమిపై దక్షిణం వైపుకి పయనిస్తున్నంతకాలం రాతిరి గాను, ఉత్తరం వైపుకి పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏవిధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని ప్రజలందరికి ఈ విషయం తెలియజేయడం కోసం పెద్దలు పండుగలను జరపడం మొదలు పెట్టారు. ముక్కోటి ఏకాదశి దేవతలకు తెల్లవారుజాముగా నిర్ణయించి దేవతలు నిద్రలేచే వేళ అయిందని ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు వెళ్లి స్వామి వారి దీవెనలను అందుకుంటారు. అలాగే వైకుంఠం నందు ముక్కోటి ఏకాదశి రోజున ద్వారాలు తెరిచి ఉంటాయని అన్ని విష్ణు దేవాలయాలలో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
                              ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడినది. ఉత్తరాయణ కాలమందు చేయు దానాలలో ఉత్తమమయినవి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు.
                     ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం. అందుకే పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంధ మరణాన్ని కోరుకున్నాడ

No comments:

Post a Comment

Please feel free to give feedback , Thank you :)